కురుపాం మండలంలోని ఊసకొండ పంచాయితీ గిరిశిఖర గ్రామమైన పనసభద్రలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో ఇంటింటికి కొళాయి పథకం నిర్మాణం. పూర్తయినా, నేటికీ ప్రారంభించకపోవడంతో ఒకే ఒక్క చేతి బోరును ఆశ్రయించాల్సి వస్తోంది. వేసవి సమీపించడంతో చాలాసార్లు అధికారులకు తమ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు వినతి పత్రాలు అందించినా పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని అన్నారు. ఇంటింటికీ తాగునీటి పథకం నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంతవరకు తాగునీరందించే దాఖలాలే లేవన్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటింటి కుళాయిలు దిష్టిబొమ్మలా ఉండడం తప్ప వాటి వల్ల తమకు ఉపయోగం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.