మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలం నాగయ్య పేట గ్రామంలో విలేకరుల సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పివిజి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జల జీవన్ మిషన్ పథకంలో భారీ కుంభకోణం జరిగిందిన్నారు. ఈ కుంభకోణంలో భాగంగా టెండర్ లేకుండా, పాత టెండర్ ఆపివేసి క్వాలిటీ కంట్రోల్ పేరుతో ఆరు కంపెనీలు కు ఇవ్వడం జరిగింది. జల జీవన్ మిసన్ పథకంలో 35 లక్షల కొళాయిలకు గాను, ఒకటి 500 రూపాయలు ఉంటే, కాని ఒక్కటి 1250 రూపాయిలు అని బిల్లులు పెట్టి భారీ కుంభకోణం చేశారన్నారు. స్థానిక శాసనసభ్యుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, (RWS)మంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంపీడీవో లకు, సీఈఓ లగా, డిపిఓ లగా ప్రమోసన్ లు ఇచ్చి అతిపెద్ద కుంభకోణానికి తెర తీశారు. ఇప్పుడు మరలా జలజీవన్ మిషన్ కొళాయిల కొనుగోలు కుంభకోణంలో 100 కోట్లు కమిషన్ ఒక కీలక నేతకు ముట్టినట్లు ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తల దృష్ట్యా, ఎంక్వైరీ కమిటీ వేసి నిజ నిజాలు తేల్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఇంచార్జ్ పివిజి కుమార్ డిమాండ్ చేశారు. ఈ శాఖ మంత్రిగా ఉన్న మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యుడు ముత్యాల నాయుడు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈ కుంభకోణంలో నాకు ఏమి సంబంధం లేదని ఎంక్వైరీ వేయించుకొని, నిరూపించుకో వాలని పివిజి కుమార్ చాలెంజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు కసిరెడ్డి అప్పల నాయుడు, నియోజక వర్గ పోల్ మేనేజ్మెంట్ ఇంచార్జ్ జూరెడ్డి రాము, అనకాపల్లి జిల్లా పార్టీ ఉప అధ్యకుడు చల్లా నానాజీ, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కర్రీ నాయుడు, సర్పంచ్ కర్రీ దేముల్లు, ఎక్స్ మండల పార్టీ ప్రెసిడెంట్ బండారు రామారావు, నియోజకవర్గం తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కడిమి నాగేశ్వరరావు, తమడాన ప్రసాద్, మరియు తదితరులు పాల్గొన్నారు.