సౌండ్ తగ్గించమని చెప్పిందని ఓ వ్యక్తి గర్భిణిని కాల్చిచంపిన ఘటన ఢిల్లీ శివారులోని సిరాస్ పూర్ లో జరిగింది. ఈనెల 3న రంజు(30) ఇంటి సమీపంలో ఉండే హరీశ్ తన కుమారుడి బారసాల నిర్వహిస్తూ డీజే పెట్టాడు. దీంతో గర్భిణి అయిన రంజు తనకు ఇబ్బందిగా ఉందని, సౌండ్ తగ్గించాలంటూ కోరింది. దీంతో హరీశ్ తన స్నేహితుడి చేతిలో ఉన్న గన్ తీసుకొని రంజుపై కాల్పులు జరిపాడు. దీంతో రంజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.