మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం జరిగింది. అకోలా జిల్లా బాలాపూర్ తహశీల్లోని పారాస్ గ్రామంలోని ఓ ఆలయంలో పెద్ద వేపచెట్టు కూలిపోయి రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రేకుల షెడ్డు కింద 50 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం సమయంలో భారీ వర్షం రావడంతో భక్తులు షెడ్డు కింద గుమికూడినట్లు తెలుస్తోంది.