ఓ 15 ఏళ్ల బాలిక నిర్విరామంగా 8 గంటలపాటు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఛత్తీస్ గఢ్ దుర్గ్ జిల్లా పురాయి గ్రామానికి చెందిన చంద్రకళ ఓజా అనే బాలిక ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విరామం లేకుండా ఈత కొట్టింది. చెరువులో 8 గంటల పాటు 64 రౌండ్లు ఈత కొట్టి రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి తామ్రధ్వాజ్ సాహూ కూడా హాజరయ్యారు.