ప్రమాదంలో చిక్కుకున్నటూరిస్టులను బోటు డ్రైవర్లు కాపాడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఖాండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్ రిజర్వాయర్ ను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులు నదిలోకి దిగారు. ఇంతలో డ్యామ్ నుండి అకస్మాత్తుగా నీరు విడుదల చేయడంతో 20 మంది టూరిస్టులు వరదలో చిక్కుకుపోయారు. దీంతో అక్కడున్న బోటు డ్రైవర్లు ప్రాణాలకు తెగించి తాడు సాయంతో వారిని కాపాడారు.