ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాంబు పేలి నలుగురు మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 09:59 AM

పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లో మరోసారి బాంబుదాడి జరిగింది. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు పోలీసులు సహా నలుగురు మరణించారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్వెట్టాలోని షహ్రా ఈ ఇక్బాల్‌ ప్రాంతంలో ఆగివున్న పోలీసు వాహనం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa