శ్రీకాకుళం పోరాట యోధుడు, పౌర హక్కుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ పులి రామకృష్ణయ్య అనారోగ్యంతో ఆదివారం స్వగ్రామమైన పార్లపల్లిలో మృతి చెందారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) జిల్లా కమిటీ నాయకులు మూలం రమేష్, ఎం. మోహన్‌రావు, దయాకర్, గోనె దయాకర్, సుబ్యయ్య ఆయన మృతదేహన్ని సందర్శించి నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) నాయకులు మాట్లాడుతూ.... ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో జీవితాన్ని ప్రారంభించిన రామకృష్ణయ్య ఆ పార్టీలో వచ్చిన చీలికల్లో సీపీఐ(ఎం) పంధాలో నడిచి శ్రీకాకుళం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆనంతరం పౌర హక్కుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారన్నారు. రామకృష్ణయ్య మృతి ప్రజా ఉద్యమ నాయకులకు తీరని లోటని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa