ఉత్తర చైనా నగరాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంగోలియా నుంచి ఉద్భవించిన భారీ ఇసుక తుపాను, ఉత్తర చైనా నగరాలను చుట్టుముట్టింది. దీంతో పలు ప్రాంతాలు ధూళి మేఘాలతో నిండిపోయాయి. రోడ్లపై ఇసుక దిబ్బలు పేరుకుపోతున్నాయి. ఇసుక తుపాను వల్ల పలు ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల్లో మరిన్ని ఇసుక తుపానులు ఏర్పడే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణశాఖ పౌరులను హెచ్చరించింది.