శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మత్సోవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. రథాన్ని రథం బజారు గుండా బురుజు సెంటర్‌కు తెచ్చి, తిరిగి ఆలయానికి చేర్చారు. వేడుకల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రథోత్సవం సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి మాచర్లకు రావడంతో ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రథోత్సవానికి ముందే చెన్నకేశవస్వామి దేవాలయానికి వెళ్లిన బ్రహ్మరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్లిపోయారు. ఉత్సవాల నేపథ్యంలో పట్టణం లోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాయి. కొన్ని స్టాల్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కూరగాయాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏడాది కూడా మార్కెట్‌లో అన్నదానం చేశారు.