రాజుపాలెం మండలం రెడ్డిగూడెం పులిచింతల కాలనీకి చెందిన అన్నపూర్ణ రెడ్డి మాధవరెడ్డి (45) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆకులగణపవరం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముందుగా వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలు అతనికి తీవ్ర గాయాలు కాగా బంధువులు సత్తెనపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య వెంకట్ రావమ్మ విలపిస్తున్న తీరు చూపులను కంటతడి పెట్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa