సంప్రదాయ చేనేత వృత్తిని ప్రోత్సహిస్తూ, మగ్గాల ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం జోడింపుతో ఉత్పత్తుల నాణ్యత పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పథకంతో 90 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్టు సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతి మంగళవారం అన్నారు. వస్త్ర ఉత్పత్తి దారులుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పేరిట సబ్సిడీ రుణాలను ఇస్తోందని తెలిపారు.