అమెరికాలో విశ్రాంత మెకానిక్ వందల కోట్ల విలువ చేసే లాటరీ గెలుచుకున్నారు. డబ్యూక్ నగరానికి చెందిన ఎర్ల్ లాపే ఏప్రిల్ 1న లొట్టో ఆమెరికా టికెట్ కొనుగోలు చేశాడు. ఆయన కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్లు(రూ.328 కోట్లు) గెలుచుకుంది. అయితే ఇదేదో జోక్ అనుకున్నానని, ఏప్రిల్ ఫూల్ అవుతానేమోనని బిగ్గరగా నవ్వేశానని ఆయన తెలిపారు. బహుమతి మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడంతో ఆయనకు 21.28 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి.