పంజాబ్లోని భటిండా మిలటరీ స్టేషన్లో కాల్పులు కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారని సౌత్ వెస్ట్రన్ కమాండ్ తెలిపింది. ఆర్మీ అంతర్గత కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఇది ఉగ్రదాడి కాదని, మిలిటరీ స్టేషన్లో కొంత అంతర్గత పరిణామంగా అనిపిస్తోందని ఎస్ఎస్పీ ఖురానా అన్నారు.