ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 45-60 ఏళ్ల లోపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదని, గత రెండేళ్లలో ఈబీసీ నేస్తం ద్వారా రూ.12 వందల కోట్లు అందించామని వెల్లడించారు.