వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. 4.39 లక్షల మహిళల ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున మొత్తం రూ.658 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు అని, నిరుపేద అక్కాచెల్లెళ్లకు అండగా ఉండేందుకే ఈ పథకాలు రూపొందించామని తెలిపారు.