పేదరికానికి కులం, మతం ఉండదని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డ ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావన్నారు. ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు. ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నామని చెప్పారు. మహిళలకు 50 శాతం. రిజర్వేషన్‌పై చట్టం చేశామని, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని సీఎం పేర్కొన్నారు.ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ఏ జిల్లాను తీసుకున్నా… గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఛాలెంజ్ విసిరారు.