రష్యా తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలోని షివేలుచ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. భారీ ఎత్తున బూడిద వెదజల్లుతుండగా ఆకాశంలో చాలా ఎత్తు వరకూ ఇది వ్యాపించింది. ఇది మంగళవారం పేలినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి విస్పోటనం తర్వాత సుమారు 6 గంటల వరకూ యాక్టివ్ గా ఉందని వెల్లడించారు. లావాతో మంచు కరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.