విజయవాడ తూర్పు నియోజకవర్గం వైయస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాణిగారితోటలో నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతకు 200 మంది కార్యకర్తలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో కృష్ణలంక, రాణీగారి తోట ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. నిన్నటి సభ చూసైనా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలోనే రాణిగారితోట ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇంటింటికీ కుళాయిలు అందించాం. చంద్రబాబు మీటింగ్ పెట్టుకున్న సభకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ మేం నిర్మించిందే. రిటైనింగ్ వాల్ నిర్మించింది కూడా సీఎం వైయస్ జగన్ ప్రభుత్వమే అని దేవినేని అవినాష్ అన్నారు.టీడీపీ నేత గద్దె రామ్మోహన్, చంద్రబాబు అందరూ కట్టకట్టుకుని కృష్ణా నదిలో దూకాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.