కోడికత్తి కేసులో ఇకనైనా తమ కొడుకును విడుదల చేయాలని కోడి కత్తి శీను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారు మాట్లాడుతూ.. సీఎం జగన్కు కోడి కత్తి గుచ్చుకున్న ఘటనలో ఎవరి ప్రమేయం లేదని అనుకోకుండా జరిగిందని తాము అప్పుడే చెప్పామన్నారు. ఎన్ఐఏ విచారణలో కూడా అదే తేలిందన్నారు. కాబట్టి ఇకనైనా తమ కొడుకును విడుదల చేయాలని వేడుకుంటున్నారు. చేయని నేరానికి ఎన్నేళ్ళు జైల్లో పెడతారని ప్రశ్నిస్తున్నారు. తమ కొడుకు శీను జగన్ అభిమాని అని తెలిపారు. ఇన్నేళ్లు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం అన్యాయమన్నారు. ఎన్ఐఏ నివేదికతో అయినా తమ కుమారుడు జైలు నుంచి బయటకు వస్తాడని ఆశిస్తున్నామని కోడికత్తి శీను తల్లిదండ్రులు తెలిపారు.