టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏమీ తెలియని అమాయక చిన్న పిల్లల లాంటి వ్యక్తి అని మంత్రి రోజా పేర్కొన్నారు. వారి కుటుంబం తప్ప వేరే ప్రజల గురించి గానీ.. పార్టీ కార్యకర్తల అభివృద్ధి గురించి ఆలోచించని కుటుంబం నారావారిదని విమర్శించారు. వారి రాజకీయ భవిష్యత్తు వారి ఆర్థిక అభివృద్ధి వారి కుటుంబం స్వార్థం అన్న ఉద్దేశంతోనే వారు నడుచుకుంటారు తప్ప ఇతరుల గురించి ఏమీ ఆలోచించని కుటుంబం నారావారిదని అన్నారు. భారతదేశంలోనే అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రోజా కొనియాడారు.