టీడీపీ అధినేత చంద్రబాబుపై , మాజీ మంత్రి వైసీపీ నాయకులూ కొడాలి నాని విరుచుకుపడ్డారు. కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్ర బాబు జిత్తుల మారి నక్క. ఆయన గుడివాడ కు చేసింది ఏమీ లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలి. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇపుడు దొంగ ప్రేమ ఒలక పోస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నాం. నిమ్మకూరు వెళ్తే చంద్రబాబుకు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు. అందుకే బస్సులో పడుకున్నాడు. పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారు ఇంటికి వెళ్ళి పడుకున్న చంద్ర బాబుకు సిగ్గు ఉందా? నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది నేను, జూనియర్ ఎన్టీఆర్. 60 లక్షలు పేట్టి 2003లో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశాం. నిమ్మకూరు పై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు మాత్రమే. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవు’’ అని పేర్కొన్నారు.