వైసీపీ సర్కార్ ను ఉపేక్షించే స్థితిలో కేంద్రం లేదని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ సీరియస్ గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వాస్తవాలను బయటపెడుతున్న మీడియాపై కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు. రైతు సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూ. 10 ఇస్తున్న జగన్ ప్రభుత్వం... వారి నుంచి రూ. 100 లాక్కుంటోందని అన్నారు. అన్ని విషయాలను బీజేపీ హైకమాండ్ గమనిస్తోందని చెప్పారు. ఏపీలో రాబోయేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని అన్నారు