రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని అమరావతి దళిత జేఏసీ నాయకులు పులి చిన్నా పేర్కొన్నారు. అమరావతికి భూములు ఇచ్చినది 95శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని గుర్తు చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో రైతులు, రైతు కూలీలు మనోవేదనతో చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. పగ, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులు, అరెస్టులపై చూపుతున్న పట్టుదల రాష్ట్రాభివృద్ధిపై చూపటం లేదని విమర్శించారు. కేంద్రం గతంలో సహకరించి ఉంటే ఇప్పటికే ఆంతర్జాతీయ రాజధానిని రూపొందించుకునే వాళ్లమన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి కాని, పాలనా వికేంద్రీకరణ వలన అభివృద్ధి సాధ్యం కాదన్నారు.