బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండల పరిధిలోని పెదపులివర్రు గ్రామపంచాయతీ పరిధిలోని జిలుగువారి పాలెంలో శనివారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పాలనలో వ్యత్యాసాలను ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీపి, దావూరి వెంకట లలిత కుమారి మాట్లాడుతూ గృహసారథులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు ఏప్రిల్ 20వ తేదీ వరకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రజలకు వివరించి ప్రజాభిప్రాయాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో, గృహసారధులు, జిలుగు పూర్ణచంద్రరావు, పులివర్తిసుమతి, వలేంటీర్లు, పులివర్తి అశోక్, టి. రత్న, వైసిపి నాయకులు నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.