మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి రాధారంగా నగర్లో శనివారం ఎమ్మెల్యే ఆర్కే పర్యటించారు. రాధారంగ నగర్లో కమ్యూనిటీ హాల్ మరియు వాటర్ ట్యాంక్ ఒకే ఆవరణలో ఉండి ప్రహరీ లేకపోవడంతో సుమారు రూ. 31 లక్షల కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈమేరకు పనులు పూర్తికావడంతో శనివారం ఎమ్మెల్యే ఆర్కే ఈ పనులను పరిశీలించారు.
అనంతరం సుమారు రూ. 7 లక్షల నిధులతో నిర్మించిన గ్రావెల్ రోడ్డును ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. గ్రామ ప్రజలు రాధారంగా నగర్ నందు ఎలక్ట్రికల్ పోల్స్ మరియు డ్రైన్ లు, కొన్ని రోడ్లకు గ్రావెల్ అలాగే కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో మెరకు తోలాలని ఎమ్మెల్యే ఆర్కే కి వినతి పత్రాలు సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పనులను ప్రారంభించాలని కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు.