పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లి గ్రామ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. మృతుడు శీలం లక్ష్మయ్య (40), క్షతగాత్రుడు కంకారపు కొండలు దుర్గి మండలం మించాల పాడు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దుర్గి పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.