గుంటూరు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మెడికల్ క్యాంపుకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్వయంగా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మెడికల్ క్యాంపు ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.