పారిశ్రామిక ప్రాంతం శ్రీహరి పురంలో గుర్తుతెలియని యువకుడు అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి యువతిపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దినసరిగా కూలిగా పని చేస్తున్న గౌరీ తన కుమార్తె (17) కలిసి శ్రీహరిపురం ప్రధాన రహదారి వెనుక రోడ్డులో అద్దింట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడు మాస్క్ ధరించి నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. యువతి మెడపై చాకుతో దాడి చేయడంతో తల్లీకుమార్తె కేకలు వేశారు. చుట్టుపక్క నివాసితులు వచ్చే సరికి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని స్థానిక సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. గౌరీ ఫిర్యాదుతో మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బి. లూథర్బాబు దర్యాప్తు చేయగా అనుమానితుడే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ చానల్ విలేకరిగా చెలామణి అయిన వ్యక్తి దారుణానికి ఒడికట్టినట్లు నిర్దారణ కొచ్చారు. అక్రమ సంబంధమే ఘటనకు కారణమని సమాచారం హత్యాయత్నంగా కేసునమోదు చేసిన మల్కాపురం పోలీసులు శనివారం సిఐ లుదర్ బాబు ఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు.