మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యామని జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ప్రభుత్వ విప్, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ చెప్పారు. శనివారం సాయంత్రం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన జగనన్నే మా భవిష్యత్తు సక్సెస్ మీట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సమస్యను తామే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకొని మరీ వాటిని పరిష్కరిస్తున్నామని ధర్మశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బివి సత్యవతి, ఎలమంచిలి శాసనసభ్యులు రమణమూర్తి , తదితరులతో కలిసి ధర్మశ్రీ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తూ ఉండడాన్ని చూస్తున్నామని చెప్పారు.
ఒకపక్క ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూనే మరోపక్క ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని కూడా వివరించే ప్రయత్నం చేసేందుకు ఈ కార్యక్రమం అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల మద్దతును వారి మనసులను చూరగొనే ప్రయత్నంలో వైఎస్సార్సీపి ఈ కార్యక్రమం ద్వారా విజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల గృహ సారధులు 60 లక్షల మందిని కలవడం జరిగిందని ఇది నిజంగానే రికార్డ్ అని చెప్పారు. ప్రజల మద్దతు కోరుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పొందుతున్న వారు 50 లక్షల మంది 8 2 9 6 0 8 2 9 6 0 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు.
రాష్ట్రంలో ఉండే గల్లీ దగ్గర నుంచి మారుమూల పల్లె వరకు వరకూ గడప గడపలోనూ మా నమ్మకం నువ్వే జగన్ నినాదం వినిపించిందని జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే అభిప్రాయాన్ని ప్రజలంతా వ్యక్తం చేశారని తెలిపారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని బలమైన నాయకుడు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలందరూ నమ్మారని తెలిపారు. ప్రజలు ఓట్లతో గెలుపొందిన ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు మాత్రమే జవాబుదారీ అనే సిద్ధాంతాన్ని అసెంబ్లీ సమావేశాలకో పరిమితం కాకుండా ప్రజల వద్దకే వెళ్లాలి ప్రజలతో అభిప్రాయం తెలుసుకోవాలి అప్పుడే దాని సాధికారత లభిస్తుందన్న విషయాన్ని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గృహసారథులు వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లు ఓట్లేసిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుసుకొని ప్రభుత్వ పాలన పైనా సంక్షేమ పథకాల పైనా అభిప్రాయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో 98. 4% ఈరోజు విజయవంతంగా అమలు చేయగలిగాం కాబట్టే ప్రజాప్రతినిధులమైన తాము ప్రజల వద్దకు వెళ్లి మీకు ఏ మేరకు మేలు జరిగింది? ఇంకా ఎక్కడ అన్యాయం జరుగుతుంది? అనే విషయాన్ని స్పష్టంగా అడగగలుగుతున్నామని అన్నారు.