ఎస్ఈజెడ్ లో గల రుషిల్ డెక్కర్ ప్లైవుడ్ పరిశ్రమలో నిర్వాసితులు, ముఠాకార్మికులు నేటికి 11 రోజులుగా పరిశ్రమ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. 2019 నుండి అమలవుతున్న కూలి రేట్లు యధావిధిగా కొనసాగించాలని కంపెనీ ఎదుట నిరసన తెలుపుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం అనకాపల్లి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి సువర్ణని కలిసి న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు ఆర్ రాము వినతి పత్రం అందజేశారు.