అచ్చుతాపురం: హరిపాలెం గ్రామంలో, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల నైరా, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మట్టి పరీక్షల ప్రాముఖ్యత పైన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా మట్టి నమూనా సేకరణ గురించి, సేకరించిన నమూనాతో పాటు, రైతు పేరు, పొలం సర్వే నెంబరు, మొదలగు వివరాలు రాసి ల్యాబ్ కి పంపించాలని వివరించారు. పరీక్షా ఫలితాల అనుగుణంగా ఎరువులు చల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు రైతులు కె. రాము , కె. కన్నారావు , కె. వీరునాయుడు, మరికొందరు రైతులు మరియు నైరా విద్యార్థులు ఎం. తులసి, బి. శ్రావణి, కె. ప్రమీల, టి. యామిని, సిహెచ్. నీరజ పాల్గొన్నారు.