హనుమాన్ శోభ యాత్ర సందర్భాన్నిపురస్కరించుకుని విశాఖ నగరంలో శనివారం మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కరాస జంక్షన్ నుంచి మర్రిపాలెం, కంచరపాలెం, మెట్ట మహారాణి పార్లర్ జంక్షన్, డైమండ్ పార్క్, సీతమ్మపేట రోడ్డు, గురుద్వార్ జంక్షన్, సీతమ్మధార, హెచ్డ్ బీచ్ రోడ్డు, కురుపాం సర్కిల్, కాళీమాత గుడి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.