పలమనేరు పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శనివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా హాస్టల్ నెంబర్ 1 హాస్టల్ నెంబర్ 2 లో చదువుకుంటున్న విద్యార్థులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జిల్లా ఉపాధ్యక్షుడు మాదేశ్, జిల్లా సెక్రెటరీ నాగరాజ్ మరియు పలమనేరు బ్లాక్ అధ్యక్షుడు శివశంకర్ , బాలుల హక్కులపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం వసతి గృహంలో వసతులపై ఆరా తీయగా కనీస సదుపాయాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పిల్లలు వాపోయారు. బాత్రూం తలుపులు విరిగిపోవడంతో స్నానం చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వెంటనే ఫోను ద్వారా ఏ. ఎస్. డబ్ల్యూ. అధికారి మరియు జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వసతి గృహంలో ఉన్న సమస్యలను వారం లోపు పరిష్కరించాలని సూచించడం జరిగింది.