దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రెండవ రోజు మదనపల్లి లో ప్రచారబేరిని కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నాయకులు మురళీ, శర్మ లు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక శ్రామిక ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసం పెద్ద పేట వేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకొక్కటే తన అనుచర వర్గానికి అప్పగిస్తు, దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారన్నారు. కార్పొరేట్ ముసుగులో దేశ సంపదను బిజెపి, ఆర్ఎస్ఎస్ లూటీ చేస్తుందన్నారు. మోడి ప్రభుత్వం తన అనుచరులు కోట్ల రూపాయలు రాయతీలు ప్రకటిస్తు, దేశ ప్రజలపైన పన్నుల బారం మోపుతున్నారన్నారు.
బిజెపి ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనం కోసం దేశంలో మతవిధ్వేశాలను రెచ్చగొడుతూ మతాల మధ్య మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. బిజెపి దేశ ప్రజలకు వరగబెట్టింది ఏమిలేదని, హిందూ మతాన్ని ముందు పెట్టుకొని రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం దేశ ప్రగతికే ప్రమాదమని ఈ దేశంలో ఉన్న ప్రజాతంత్ర పార్టీలు, లౌకిక వాదులు, వామపక్ష పార్టీలు కలసి బిజెపిని అధికారం నుండి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, పవన్ కుమార్, వెంకటేష్, సహదేవ, సూరి, తిరుమల, శోభ, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.