కేంద్ర పథకం ‘మిషన్ వాత్సల్య’ అమలుకు కొత్త జిల్లాల పరిధిలో 423 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. కాంట్రాక్ట్ విధానంలో 311, తాత్కాలిక విధానంలో 15, అవుట్ సోర్సింగ్ విధానంలో 97 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా బాలల రక్షణ యూనిట్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు, బాలల సంరక్షణ కమిటీ, జువెనైల్ జస్టిస్ బోర్డు, బాలల గృహాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.