యాప్ ల ప్రభావం చిన్నారులపై కూడా బలంగా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 10 ఏళ్ల బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శనివారం తమ కూతురిని ఆ బాలుడు స్కూల్ భవంతిపైకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఒకటవ తరగతి చదువుతుండగా బాలిక కిండర్‌గార్టెన్‌లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa