దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఆదివారం రోజున మహారాష్ట్రలో జరిగిన ఓ వేడుకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.నావీ ముంబయిలోని మహారాష్ట్ర భూషన్ అవార్డు వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఆరోజు ఎండ 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆ ఎండకు తట్టుకోలేక 11 మంది వడదెబ్బతో మృతి చెందడం కలకరం రేపింది. అలాగే మరో 50 మంది ఆసుపత్రిలో చేరారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతలు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై ఉప మఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా స్పందించారు. ఈ వేడుకకు వచ్చిన వారిలో ఎండ తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారి చికిత్సకు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలోని పలు ప్రాంతాల్లో మరో 4,5 రోజుల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎండ పెరుగుతుందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది.