ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, దిగుపల్లి గ్రామంలో వెలిసియుండు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం కు కుప్పం ఎమ్మెల్సీ భరత్ వారి సతీమణి అమ్మవారి దర్శనం కోసం వారి మొక్కుబడుల కోసం విచ్చేశారు. వారిని కొండపైకి మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ ఆహ్వానిస్తూ కార్య నిర్వహణ అధికారి సూచనలు మేరకు ఆలయ అర్చకులు మరియు సిబ్బంది ఆలయ మర్యాదలతో దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు.