సిద్ధవటం మండలం ఎస్ రాజంపేట గ్రామం నందు అగ్ని ప్రమాదంతో పాక్షికంగా ఇండ్లు కాలడంతో పేద వారైన భవనాసి చిన్నయ్య కుటుంబానికి రాజంపేట నియోజకవర్గ శాసనసభ్యులు మేడా మల్లికార్జున్ రెడ్డి మరియు ఇంచార్జ్ మేడా మధుసూదన్ రెడ్డి మరియు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ జవహర్ బాషా ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున వారికి నివాస గృహాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో గ్రామ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాజంపేట మాజీ సర్పంచ్ పార్ల రమణ, వైసిపి నాయకులు అతికారి ప్రసాద్, వైసిపి సోషల్ మీడియా వినోద్ కుమార్, ఎస్ రాజంపేట సర్పంచ్ వెంకటయ్య, మునెయ్య, వెంకటసుబ్బయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.