ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి డాక్టర్ కె. మన్మధరావును ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గర్గ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, జిల్లా జడ్జి తదితరులు పాల్గొన్నారు.