రాష్ట్రంలో వైకాపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడుదామని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలువు నిచ్చారు. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం 3 వార్డులో మునెప్ప కాలనీ, జన్మభూమి కాలని ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఇంఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా వైకాపా అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ మీ ఇంటికి కరపత్రాలను విడుదల జేశారు. ఈ సందర్భంగా భవాని ప్రసాద్ మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైన అభివృద్ధి జరిగింది ఏమీలేదన్నారు. ప్రతి పక్షాలపై అక్రమ కేసులు, అరాచకాలు, దౌర్జన్యాలతో ప్రజలు మార్పు కు సిద్ధంగా వున్నారని పేర్కొన్నారు. పట్టణ ఉపాధ్యక్షులు యర్రబల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో చేనేత రంగం తీవ్ర మైన సంక్షోభంలో కూరుకుపోయిందని కార్మికులు ప్రాణాలు వదులుతున్నారని అన్నారు. ఇప్పటికే పెరిగిపోయిన ముడి సరకు ధరలతో కుదే లైన లైన చేనేత రంగానికి మళ్ళి పూర్వ వైభవం రావాలంటే టీడీపీ వస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మేకలశేఖర్, యూనిట్ ఇంచార్జి రెడ్డి శేఖర్, బూత్ కన్వీనర్లు మహేష్ హేమంత్, రాజ్ కుమార్, సహదేవ, మోహన్, నిసార్, ఐటిడిపి కాశీ శ్రీరామ్, వేల్పుల వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.