రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు జరగనుంది. విజయవాడలోని గొల్లపూడి బైపాస్ రోడ్డులోని విద్యాధరపురం మినీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి 15 వేల మందికి పైగా హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.