తాను రాజకీయాల్లో ఉన్నానని వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మాట్లాడారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని అన్నారు. అలాగే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా తనవంతు కృషి చేస్తానని అన్నారు. వావిలాల గోపాలకృష్ణ చేపట్టిన పైసా ఉద్యమం స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవచ్చని చెప్పారు.