దుబాయ్‌లోని ఓ నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనంలోని నాలుగో అంతస్తులో అంటుకున్న మంటలు క్రమంగా మిగతా అంతస్తులకు పాకాయి. సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని నివాసితులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa