అనంతపురం మండలంలోని పాపంపేటలో టీడీపీ మండల కార్యాలయ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఏవైనా మనస్పర్థలున్నా వాటిని పక్కన పెట్టి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాన్నారు.