వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో అవినాష్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. వివేకా హత్యతో తనకు సంబంధం లేదని, నిందితుల కుటుంబ సభ్యులకు, వివేకాకు అక్రమ సంబంధాలున్నాయని తెలిపారు. వివేకా కూతురు సునీతకు, ఆయన రెండో భార్యకు వివాదాలున్నాయని, స్థానిక ఎమ్మెల్సీతో కలిసి సునీత తనపై కుట్ర చేసిందని ఆరోపించారు.