బఠిండా ఆర్మీ స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తోటి సైనికుడే వ్యక్తిగత కక్షతో నలుగురిని చంపేసినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. దీంతో అతడిని సోమవారం అరెస్టు చేశామని బఠిండా ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా వివరించారు. బఠిండాలో ఈ నెల 12న కాల్పుల కలకలం తెలిసిందు. టెంట్ లో నిద్రిస్తున్న నలుగురు జవాన్లపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.