టర్కీలో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం వల్ల 50 వేల మందికిపైగా మరణించగా.. సుమారు 16 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.