దేశంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, నేరస్తులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ యువకుడు దాడి చేసి, ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్తాడు. ఈ ఘటన బెంగళూరులోని చంద్రా లేఅవుట్ ప్రాంతంలో జరిగింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa